నవతెలంగాణ – హైదరాబాద్: విజయ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘జన నాయగన్’ విడుదలపై కొనసాగుతున్న వివాదంలో మద్రాసు హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా విడుదలకు సంబంధించిన సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ సీబీఎఫ్‌సీ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఇరు వర్గాల వాదనలు సుదీర్ఘంగా విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో ‘జన నాయగన్’ విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
The post ‘జన నాయగన్’ విడుదల వివాదం.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు appeared first on Navatelangana.
Leave A Comment