అనకాపల్లి,(విశాఖ
సమాచారం బ్యూరో):- రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ
ఆంధ్ర” కార్యక్రమానికి అనుసంధానంగా, జిల్లా పోలీసు విభాగం ఆధ్వర్యంలో
“వర్షాకాలంలో వరదలు మరియు అంటువ్యాధుల నివారణ” పై ప్రజల్లో అవగాహన
కార్యక్రమం నిర్వహించారు.జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఆదేశాల మేరకు, ఈ
కార్యక్రమాన్ని జిల్లా అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్ మరియు ఎల్. మోహనరావు
పర్యవేక్షణలో నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీలు మాట్లాడుతూ
వర్షాకాలంలో ప్రజలు తప్పనిసరిగా మరిగించిన లేదా శుద్ధి చేసిన నీరు మాత్రమే
తాగాలి. బయట ఆహారాన్ని నివారించాలి. దోమల పెంపకానికి కారణమయ్యే నీటి
నిల్వలను వెంటనే తొలగించాలి” అని సూచించారు.జిల్లా వ్యాప్తంగా పోలీసు
కార్యాలయాలు, స్టేషన్లలో స్వచ్ఛత కార్యక్రమాలు, ఫాగింగ్, మరియు వరదల
ప్రభావం తగ్గించే చర్యలు చేపట్టారు. పోలీసు సిబ్బంది తమ పరిధిలోని ప్రజలకు
శుభ్రతపై అవగాహన కల్పిస్తూ, ఆరోగ్య రక్షణ చర్యలను నిరంతరం కొనసాగించాలని
పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలతో పాటు ఇన్స్పెక్టర్లు
లక్ష్మీ, రమేష్ తదితర అధికారులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు
Leave A Comment