• Login / Register
  • Site Logo

    ఇదే రిథమును కొనసాగించండి: సచిన్ టెండుల్కర్

    క్రీడలు

    ఇండస్ట్రీ డెస్క్: టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్-8లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ప్రదర్శనపై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ప్రశంసలు కురిపించారు. భారత జట్టు ఇదే రిథమ్‌ను కొనసాగించాలని ఆయన సూచించారు. కీలకంగా జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా సత్తా చాటింది. 256 పరుగుల భారీ స్కోర్ చేయడం ప్రశంసనీయంగా నిలిచింది. భారత్ జట్టు బలంగా ఆడింది. టీమ్ ఇండియా ఇదే రిథమ్‌ను కొనసాగించాలని ఆయన కోరుకున్నారు. ఈ టోర్నమెంట్‌లో చక్కటి ప్రదర్శన చేసిన జింబాబ్వేకు అభినందనలు అని సచిన్ ఎక్స్ వేదికగా స్పందించారు.

    సూపర్-8లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన భారత్ తన నెట్ రన్ రేట్‌ను కాపాడుకునే విధంగా తలపెట్టింది. తాజాగా జింబాబ్వేపై భారీ విజయం సాధించి తన ఆశలు సజీవంగా నిలుపుకుంది. భారత్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ (55), హార్దిక్ పాండ్యా (50*), తిలక్ వర్మ (44*) రాణించారు. ముఖ్యంగా తిలక్ వర్మ 275 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించారు. ఇషాన్ కిషన్ (38), సూర్యకుమార్ యాదవ్ (33) ఫర్వాలేదనిపించారు. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ సత్తా చాటాడు. నాలుగు ఓవర్లలో 24 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.

    Download Main Image

    Leave A Comment