నవతెలంగాణ – ముధోల్ సర్పంచ్‌లు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం బాసర ఐఐఐటీ సమావేశ హాల్లో నూతనంగా ఎన్నికైన భైంసా, లోకేశ్వరం మండలాల సర్పంచ్‌లకు నిర్వహించిన శిక్షణ శిబిరానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామాభివృద్ధిలో సర్పంచ్ పదవి అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు పంచాయతీరాజ్ చట్టం, సర్పంచ్ విధులు, బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ […]
The post సర్పంచ్‌లు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి: కలెక్టర్ appeared first on Navatelangana.
Leave A Comment