నవతెలంగాణ – హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలు చవిచూశాయి. ఒక్క రోజులోనే రూ.9 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. నిఫ్టీ 353 పాయింట్లకుపైగా పడిపోయి 25,232 వద్ద ముగియగా, సెన్సెక్స్ 1065 పాయింట్లకు పైగా నష్టపోయి 3 నెలల కనిష్ఠమైన 82,180కి చేరింది. గ్రీన్లాండ్పై US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు, టారిఫ్ల బెదిరింపులతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. దీంతో అన్ని రంగాలు నష్టాల్లోనే ట్రేడయ్యాయి.
The post భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ appeared first on Navatelangana.
Leave A Comment