• Login / Register
  • Site Logo

    పూరి జగన్నాథ్ ఆలయానికి బాంబు బెదిరింపు

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: ఒడిశాలోని పూరి జ‌గ‌న్నాథ్ ఆల‌యాన్ని పేల్చివేస్తామ‌ని మంగ‌ళ‌వారం సోష‌ల్ మీడియాలో ఓ పోస్టు వైర‌ల్ అయ్యింది. ఈ నేప‌థ్యంలో ఆల‌య ప‌రిస‌రాల్లో ఇవాళ భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. ఆన్‌లైన్ పోస్టు ఆధారంగా ఓ వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగ‌ళ‌వారం ఫేస్‌బుక్‌లో ఆ పోస్టు క‌నిపించింది. ఆల‌యాన్ని పేల్చ‌డంతో పాటు బీజేడీ రాజ్య‌స‌భ ఎంపీ సుభాషిస్ కుంతియాను అటాక్ చేస్తామ‌ని కూడా ఆ పోస్టులో హెచ్చ‌రించారు. షాపింగ్ కాంప్లెక్స్‌ను కూడా పేల్చివేస్తామ‌న్నారు.

    The post పూరి జగన్నాథ్ ఆలయానికి బాంబు బెదిరింపు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment