• Login / Register
  • Site Logo

    కరెంట్ షాక్తో రైతు మృతి

    Rss వార్తలు

    నవతెలంగాణ-జన్నారందండేపల్లి: దండేపల్లి మండలం నంబాల గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి దాసరి శేఖర్(35) అనే రైతు మృతి చెందాడు. బుధవారం ఉదయం పొలానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఎస్సై తహసిద్దీన్ తెలిపారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేతికందే దశలో ఉన్న పంటను చూసుకోవడానికి వెళ్లిన రైతు విగతజీవిగా మారడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి.

    The post కరెంట్ షాక్‌తో రైతు మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment