నవతెలంగాణ-హైదరాబాద్ : ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని బోటితండా గ్రామ సర్పంచ్ భూక్య తులసీరామ్(45) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో తులసీరామ్ బోటితండా సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే తులసీరామ్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే తులసీరామ్ […]
The post అనారోగ్యంతో చికిత్స పొందుతూ సర్పంచ్ మృతి.. appeared first on Navatelangana.
Leave A Comment