నవతెలంగాణ – హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలపై హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారులు భారీగా నగదు, బంగారం, ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో రూ.60వేల లంచం తీసుకుంటూ వెంకట్‌రెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పాఠశాల అనుమతి విషయంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.
The post అదనపు కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా నగదు స్వాధీనం appeared first on Navatelangana.
Leave A Comment