దేవరాపల్లి,(
విశాఖ సమాచారం): యోగా క్రీడా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న యోగాచార్య
అవార్డు గ్రహీత గెడ్డం నగేష్‌కు మరో గౌరవం దక్కింది. యూనివర్సల్ యోగా
స్పోర్ట్స్ ఫెడరేషన్ (యు వై ఎస్ ఎఫ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా
ఆయనను ఫెడరేషన్ ప్రధాన కార్యాలయం శనివారం అధికారికంగా నియమించింది. ఈ
సందర్భంగా గెడ్డం నగేష్ మాట్లాడుతూ యువతలో యోగా స్పూర్తిని నింపుతూ,
రాష్ట్రంలో యోగా క్రీడా వ్యాప్తికి కృషి చేయడం నా ప్రధాన లక్ష్యమన్నారు.
ప్రతిభావంతులైన యోగా క్రీడాకారులను గుర్తించి, వారికి జాతీయ, అంతర్జాతీయ
స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు.
ఫెడరేషన్
అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తానని, తనపై విశ్వాసం ఉంచిన యు వై ఎస్ ఎఫ్
ఫౌండర్ అండ్ నేషనల్ టీమ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఆయన వరల్డ్
యోగా కప్-2025కు సంబంధించిన రాష్ట్ర స్థాయి టీమ్ ఎంపిక కార్యక్రమాలను
సమన్వయం చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నగేష్ తెలిపారు.
Leave A Comment