గిల్ అద్భుత కెప్టెన్
- ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ పనేసర్
ఇంటర్నెట్ డెస్క్: రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. శుభ్‌మన్ గిల్ టీమ్‌ఇండియా కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. జూన్ 20 నుంచి భారత జట్టు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ గిల్‌కు మద్దతుగా నిలిచాడు. టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్‌గా గిల్ ఇకపై మరింత బాధ్యతగా బ్యాటింగ్ చేస్తాడని అన్నాడు.
‘నా దృష్టిలో గిల్ అద్భుత కెప్టెన్. చాలా బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేస్తాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీమ్‌ఇండియాలో లేకపోవడం ఇంగ్లండ్‌కు కలిసొచ్చే అంశం. వారిద్దరి అనుభవం భారత జట్టుకు ఎంతో ఉపయోగపడి ఉండేది. కానీ ఇప్పుడు అంతగా అనుభవం లేని ఆటగాళ్లు ఇంగ్లండ్‌తో తలపడనున్నారు. ఇంగ్లండ్ ఎలా ఆడుతుందో మాకు తెలుసు’ అని పనేసర్ అన్నాడు.
గిల్ ఇప్పటి వరకు తన కెరీర్‌లో 32 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 35.05 యావరేజ్‌తో 1893 పరుగులు చేశాడు. ఇందులో అయిదు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలున్నాయి. అతడికి ఇప్పటి వరకు విదేశాల్లో మంచి రికార్డు లేదు. గతంలో ఇంగ్లండ్‌లో మూడు టెస్టులు ఆడితే కేవలం 88 పరుగులు మాత్రమే చేశాడు. అందులో 28 పరుగులు అతడి అత్యధిక స్కోరు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ టూర్ శుభ్‌మన్ గిల్‌కు సవాలుగా మారనుంది.
Leave A Comment