దేవరాపల్లి,
(విశాఖ సమాచారం): స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మండల స్థాయి
ఆటల పోటీలు శనివారం ఉత్సాహంగా ముగిశాయి. బాలురు, బాలికల అండర్-14, 17
మండల స్థాయి గేమ్స్ సెలక్షన్ పోటీలు శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే.
మండల స్థాయి పోటీల్లో బాలురు అండర్ 14, 17 లకు 134 మంది విద్యార్థులు
ఎంపిక అయ్యారు. బాలికలు అండర్ 14,17 లకు 134 విద్యార్థినులు ఎంపికయ్యారు.
మండల
స్థాయి క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులను నియోజకవర్గ, జిల్లా స్థాయికి
పంపడం జరుగుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, మండల విద్యాశాఖ అధికారిని
సి హెచ్ ఉమ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సిహెచ్. ఉమా, స్థానిక పిడి
శ్యాంసుందర్, ఉపాధ్యాయుడు ఎల్. సత్యనారాయణ, వివిధ పాఠశాల
ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పీడీలు, తదితరులు ఈ కార్యక్రమంలో
పాల్గొన్నారు.
Leave A Comment