భారత వినియోగదారుల కోసం గూగుల్ మరో పెద్ద అడుగు వేయబోతోంది. టెక్ దిగ్గజం తన అధికారిక ఆన్‌లైన్ స్టోర్ – “గూగుల్ స్టోర్ ఇండియా” ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా వినియోగదారులు గూగుల్ ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేసే అవకాశం పొందనున్నారు.
దీంతో పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లు, పిక్సెల్ వాచ్‌లు, బడ్స్, స్మార్ట్ హోమ్ డివైసెస్ వంటి హార్డ్‌వేర్ ఉత్పత్తులు నేరుగా గూగుల్ అధికారిక వేదిక ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు భారత మార్కెట్లో ఈ ఉత్పత్తులు మూడో పార్టీ రిటైలర్లు లేదా ఈ-కామర్స్ సైట్‌ల ద్వారానే లభ్యమయ్యేవి.
టెక్ వర్గాల ప్రకారం, ఈ అధికారిక స్టోర్ ప్రారంభం ద్వారా గూగుల్ తన ఇండియన్ మార్కెట్ ప్రెజెన్స్‌ను బలోపేతం చేయడం, అలాగే యూజర్ సర్వీస్ అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. గూగుల్ స్టోర్ ఇండియా ప్రారంభ తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Leave A Comment