భారతదేశంలో డిజిటల్ పేమెంట్ విప్లవానికి నిలువెత్తు ఉదాహరణ అయిన UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ఈ అక్టోబర్ 2025లో మరో మైలురాయిని చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెలలో రూ. 28 లక్షల కోట్ల టర్నోవర్‌ను దాటేలా లావాదేవీలు జరుగుతాయని ఆన్‌లైన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
UPI వాడకం రోజు రోజుకు అధికమవుతూ, చిన్నపాటి కొనుగోళ్లు నుండి భారీ లావాదేవీల వరకు ప్రజలు దీనినే అధికంగా వినియోగిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. డిజిటల్ చెల్లింపుల అనుసరణలో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
డిజిటల్ ఎకానమీకి ఈ వృద్ధి బలాన్నిచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. వచ్చే నెలల్లో కూడా UPI లావాదేవీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా.
Leave A Comment