నవతెలంగాణ – మద్నూర్మద్నూర్ మండల కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో శుక్రవారం మిట్ట మధ్యాహ్నం పాము ఇండ్లచుట్టూ, రోడ్డుపై పాకి ఘటన కలకలం రేపింది. దీంతో కాలనీ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అపరిశుభ్రత పేరుకుపోయిన స్థలాల్లో పిచ్చి మొక్కల మూలంగా పాములు అధికమయ్యాయని స్థానికులు తెలిపారు. ఇలాంటి స్థలాల పట్ల గ్రామపంచాయతీ అధికారులు సిబ్బంది దృష్టి పెట్టాలని సూచించారు. అపరిశుభ్రత తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని ఆ కాలనీ ప్రజలు పంచాయతీ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
The post హౌసింగ్ బోర్డ్ కాలనీలో పాము కలకలం appeared first on Navatelangana.
Leave A Comment