నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ పరామర్శించారు. మంగళవారం ఆయన తండ్రి సత్యనారాయణరావు(76) మరణించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లోని హరీశ్‌రావు స్వగృహానికి వారు వెళ్లారు. హరీశ్‌రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సత్యనారాయణరావు చిత్రపటానికి నివాళి అర్పించారు.
The post హరీశ్‌రావును పరామర్శించిన వ్యకాస, సీఐటీయూ నేతలు appeared first on Navatelangana.
Leave A Comment