నవతెలంగాణ-బెజ్జంకిపత్తి క్వింటాళుకు రూ.8110 మద్దత ధర ప్రభుత్వం కల్పించిందని..రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ తెలిపారు. సోమవారం మండల పరిధిలోని ముత్తన్నపేట గ్రామ శివారులో ఓ ప్రయివేట్ మిల్లు యందు ఏర్పాటుచేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ ఏఓ సంతోశ్,ఏఎంసీ డైరెక్టర్లతో కలిసి ప్రారంభించారు. ఏఎంసీ కార్యదర్శి వెంకటయ్య,వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,ఆలయ చైర్మన్ జెల్ల ప్రభాకర్,నాయకులు కత్తి రమేశ్,సంధీప్,శ్యామ్,రాజు తదితరులు పాల్గొన్నారు.
The post సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ క్రిష్ణ appeared first on Navatelangana.
Leave A Comment