• Login / Register
  • Site Logo

    షుగర్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: కర్ణాటకలోని విజయపుర జిల్లా చడ్చన్ తాలూకా హవినాళ్ గ్రామంలో ఉన్న ఒక చక్కెర కర్మాగారంలో నిన్న సాయంత్రం (బుధవారం) భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీ పరిసరాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

    The post షుగర్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment