నవతెలంగాణ-హైదరాబాద్: మొంథా తుపాను ప్రభావంతో నల్లమల ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి రహదారిపై పడ్డాయి. దీంతో పోలీసులు ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. పెద్ద డోర్నాలలోని అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద వాహనాలను శ్రీశైలం వైపునకు వెళ్లకుండా నిలిపివేశారు. వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై పడిన రాళ్లను పొక్లెయిన్‌తో తొలగిస్తున్నారు.
The post శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు appeared first on Navatelangana.
Leave A Comment