• Login / Register
  • Site Logo

    శ్రీనగర్లో అగ్ని ప్రమాదం.. రెండు ఇండ్లు దగ్ధం

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ పోలీస్ స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో రెండు ఇండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా ప్రయత్నించి మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.

    The post శ్రీనగర్‌లో అగ్ని ప్రమాదం.. రెండు ఇండ్లు దగ్ధం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment