నవతెలంగాణ – హైదరాబాద్: చిత్తూరు జిల్లా వెదురుకుప్పం, పాతగుంటలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. స్నానానికి సిద్ధం చేసిన వేడినీటితో ఆడుకుంటూ ఒంటిపై పోసుకోవడంతో మధుశ్రీ (3) అనే మూడేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఆపై మెరుగైన చికిత్స కోసం వేలూరు సీఎంసీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
The post వేడి నీరు పడి చిన్నారి మృతి appeared first on Navatelangana.
Leave A Comment