• Login / Register
  • Site Logo

    వాటర్ ట్యాంకర్ వాహనం ఢీకొని ఏఎస్సై మృతి

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై దేవిసింగ్ ఆదివారం వాటర్ ట్యాంకర్ వాహనం ఢీకొని ప్రమాదవశాత్తు మృతి చెందారు. వికారాబాద్ జిల్లా పెద్దముల్కు చెందిన దేవిసింగ్, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా పనిచేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మరణించారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    The post వాటర్ ట్యాంకర్ వాహనం ఢీకొని ఏఎస్సై మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment