నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 3-5 డిగ్రీల మేర తగ్గిపోయాయి. దీంతో ఏపీలోని అల్లూరి జిల్లా అరకులో అత్యల్పంగా 7 డిగ్రీలు నమోదయ్యాయి. తెలంగాణలోని సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో 8.1 డిగ్రీలు రికార్డయ్యాయి. ఆసిఫాబాద్‌లో 8.4, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 8.6 చొప్పున నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
The post వణికిస్తున్న చలి..పడిపోయిన ఉష్ణోగ్రతలు appeared first on Navatelangana.
Leave A Comment