నవతెలంగాణ – హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ శివారులో న్యాయవాది స్వప్న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పొలం వద్ద దుండగులు ఆమె మెడపై నరికి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మొయినాబాద్ పోలీసులు స్వప్న అన్న రాజు, డ్రైవర్ వీరేశంను అదుపులోకి తీసుకున్నారు. స్వప్న అన్నే హత్య చేయించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
The post లాయర్ స్వప్న హత్య కేసు.. ఇద్దరు అరెస్ట్ appeared first on Navatelangana.
Leave A Comment