నవతెలంగాణ – భువనగిరి యూపీ నుండి భువనగిరికి వాహనంలో వస్తున్న కాంగ్రెస్ పట్టణ మాజీ అధ్యక్షులు బిస్కుంట్ల సత్యనారాయణకు మార్గమధ్యంలో మంగళవారం ప్రమాదం జరిగి తలకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతనిని వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే పలువురు కాంగ్రెస్ నాయకులు, ముదిరాజ్ సంఘం నాయకులు సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితులను, ప్రమాదానికి కారణమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
The post రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత బిస్కుంట్లకు తీవ్ర గాయాలు appeared first on Navatelangana.
Leave A Comment