– అభినందించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోతెలంగాణ రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో ఎక్సైజ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిటీ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చరణ్ రజత పతకాన్ని సాధించారు. సోమవారంనాడాయన తన పతకాన్ని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీంకు అందచేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కానిస్టేబుల్ చరణ్‌ను అభినందించారు. భవిష్యత్‌లో బంగారు పతకాన్ని సాధించాలని ఆకాంక్షించారు. చరణ్‌ను ఎక్సైజ్ శాఖ అడిషనల్ ఎస్పీ వెంకటేశ్‌బాబు, డీఎస్పీ తులా శ్రీనివాసరావు, బీటింగ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీప్‌రావు తదితరులు కూడా అభినందించారు.
The post రెజ్లింగ్‌లో ఎక్సైజ్ కానిస్టేబుల్కు రజతం appeared first on Navatelangana.
Leave A Comment