నవతెలంగాణ – హైదరాబాద్: బిట్‌కాయిన్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు ముంబయి ప్రత్యేక కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, తదుపరి విచారణలకు హాజరుకావాలని ఆదేశించింది. గత నెలలో రాజ్ కుంద్రాకు కోర్టు నోటీసులు జారీ చేయగా, ఆయన బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం విచారణ జరిపి బెయిల్ మంజూరు చేసింది.
The post రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూరు చేసిన ముంబయి కోర్టు appeared first on Navatelangana.
Leave A Comment