• Login / Register
  • Site Logo

    రాజపేటలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – రాజపేటరాజాపేట మండల కేంద్రంలోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం కూడలి వద్ద శుక్రవారం బిజెపి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. భారతదేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. జాతీయ సమైక్యత దినోత్సవం పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజపేట ఎస్సై అనిల్ కుమార్, ఏఎస్ఐ ప్రకాష్, యాదయ్య, బిజెపి మండల పార్టీ అధ్యక్షులు నమిల రమేష్, యువకులు నాయకులు పాల్గొన్నారు.

    The post రాజపేటలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment