నవతెలంగాణ – హైదరాబాద్: ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయాల్లో జరిగే తిరుగువారం పండుగకు వెళ్తుండగా.. భక్తులతో కూడిన బోలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి.. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల గ్రామస్తులుగా గుర్తించారు.
The post మేడారం తిరుగువారం పండుగకు వెళ్తుండగా బోలెరో బోల్తా.. 15 మందికి! appeared first on Navatelangana.
Leave A Comment