నవతెలంగాణ – హైదరాబాద్: మాజీ మంత్రి, BRS ఎమ్మెల్యే హరీశ్ రావు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణరావు కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన స్వగ్రామం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి. సత్యనారాయణ మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ తదితర బీఆర్ఎస్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
The post మాజీ మంత్రి హరీశ్ రావుకు పితృవియోగం appeared first on Navatelangana.
Leave A Comment