నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌మహిళా దినోత్సవ వేడుకల ప్రారంభ సెషన్‌కు హాజరు కావాలని టీజీవో నాయకులు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను ఆహ్వానించారు. శనివారం టీజీవో మహిళా విభాగం క్యాలెండర్-2026ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారితో చర్చించారు. ఈ కార్యక్రమంలో టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.శ్యామ్, మహిళా విభాగం చైర్ పర్సన్ డాక్టర్ దీపారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
The post మహిళా దినోత్సవానికి మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం appeared first on Navatelangana.
Leave A Comment