నవతెలంగాణ – వేములవాడమహా శివరాత్రి జాతర సందర్భంగా వేములవాడలో చేస్తున్న ఏర్పాట్లను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ గురువారం పరిశీలించారు. పార్కింగ్ ఏరియా, క్యూ లైన్లు, పారిశుధ్య పనులు, ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు సులభంగా దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. పరిశీలనలో డీఆర్డీఓ గీత, ఆర్ అండ్ బీ ఈఈ నరసింహాచారి, డీఈ శాంతయ్య, ఆలయ ఈఈ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
The post మహా శివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్ appeared first on Navatelangana.
Leave A Comment