న్యూఢిల్లీ : బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. ఇటీవల తగ్గినట్లే తగ్గి మళ్లీ సామాన్యులకు అందకుండా ఈ రెండు లోహాల ధరలు పోటాపోటీగా పరుగులు పెడుతోన్నాయి. బుధవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడిపై రూ.5,510 ఎగిసి రూ.1,59,590కి చేరింది. 22 క్యారెట్ల పసిడిపై రూ.5,050 పెరిగి రూ.1,46,300గా నమోదయ్యింది. పసిడి బాటలోనే వెండి ధరలు ఎగిశాయి. కిలో వెండిపై రూ.40,000 పెరిగి రూ.3.20 లక్షలకు చేరింది.
The post మళ్లీ పెరిగిన బంగారం ధరలు appeared first on Navatelangana.
Leave A Comment