నవతెలంగాణ – హైదరాబాద్: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన వరంగల్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై, ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔషాపూర్ వద్ద జరిగింది. కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలివైపు దూసుకెళ్లింది. పక్కనే ఉన్న రైలింగ్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.
The post మరో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులంతా..! appeared first on Navatelangana.
Leave A Comment