• Login / Register
  • Site Logo

    భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. 1500కి పైగా కాకులు మృతి

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తమిళనాడు రాజధాని చెన్నైలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. నగరంలో 1500లకు పైగా కాకులు మరణించాయి. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని ల్యాబ్‌లో పరీక్షించగా, ఈ కాకులలో అత్యంత ప్రమాదకరమైన ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (H5N1) వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చెన్నై మెట్రోపాలిటన్ కార్పొరేషన్ (GCC), పశుపాలన శాఖ బృందాలు చనిపోయిన కాకులున్న ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ, పక్షులను సున్నం వేసి పూడ్చివేస్తున్నాయి. సరిహద్దుల్లోని పౌల్ట్రీ ఫారాలపై నిఘా పెంచారు.

    The post భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. 1500కి పైగా కాకులు మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment