నవతెలంగాణ – మిడ్జిల్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో ప్రజలు ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఆయా గ్రామాలలో శివాలయంలో ఒక్కపొద్దులతో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ చల్లగా ఉండాలని ప్రత్యేక పూజలను నిర్వహించారు. చిల్వేర్ గ్రామంలో సర్పంచ్ నాగరాజ్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులతో కలిసి అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు ఉప సర్పంచులు, ప్రజా ప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
The post భక్తిశ్రద్ధలతో మహాశివరాత్రి appeared first on Navatelangana.
Leave A Comment