నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ వనస్థలిపురం పరిధిలోని బి.ఎన్. రెడ్డి నగర్‌లో అర్థరాత్రి చైన్ స్నాచింగ్ జరిగింది. రోడ్డు నంబర్ 3లో ఒక యువకుడు బైక్ పార్క్ చేసుకుంటుండగా, మరో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అతని మెడలోని గొలుసు లాక్కొని వెళ్లిపోయారు. బాధితుడు వెంటనే వెంబడించినప్పటికీ వారు దొరకలేదు. ఈ ఘటన అర్థరాత్రి 1:30కి చోటుచేసుకోవడం సిసిటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
The post బైక్ పార్క్ చేస్తుండగా చైన్ స్నాచింగ్.. appeared first on Navatelangana.
Leave A Comment