నవతెలంగాణ – హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నిక నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ మైనారిటీ యువనేతలు హస్తం గూటికి చేరారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు. రెహమత్ నగర్ డివిజన్‌లో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా మంత్రి ప్రచారం చేశారు.
The post బీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదు: మంత్రి పొంగులేటి appeared first on Navatelangana.
Leave A Comment