నవతెలంగాణ – హైదరాబాద్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. శుక్రవారం రాత్రి వండిన మిల్ మేకర్ కర్రీలో పురుగులు కనిపించాయని విద్యార్థినులు ఫిర్యాదు చేసినా, వార్డెన్ పట్టించుకోకపోవడంతో సుమారు 40 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకుని కొందరు స్పృహ కోల్పోవడంతో, స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. నిర్లక్ష్యం వహించిన వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
The post బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్.. 40 మంది విద్యార్థినులకు అస్వస్థత appeared first on Navatelangana.
Leave A Comment