• Login / Register
  • Site Logo

    ఫోన్ ట్యాపింగ్ కేసు..విచారణకు బయల్దేరిన కేసీఆర్

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను నేడు సిట్‌ విచారించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎర్రవల్లి నుంచి ఆయన హైదరాబాద్‌కు బయల్దేరారు. కేసీఆర్‌ వాహనంపై కార్యకర్తలు పూలవర్షం కురిపించారు. ఆయన వారికి అభివాదం చేస్తూ వెళ్లారు. కాన్వాయ్‌ వెంట భారీగా నేతలు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లోని నివాసంలో సిట్‌ అధికారులు కేసీఆర్‌ను విచారించనున్నారు.

    The post ఫోన్ ట్యాపింగ్ కేసు..విచారణకు బయల్దేరిన కేసీఆర్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment