• Login / Register
  • Site Logo

    ప్రేమ ఇప్పుడొక దిష్టి బొమ్మ

    Rss వార్తలు

    ఇప్పుడుమా కడుపులలో విషనాగులు పుడుతున్నాయికళ్ళనే కాదు కంటి పాపలని కూడాపొడుచుకు తినే కాలనాగులను కంటున్నాంకొత్త కొత్త ప్రేమలు పుట్టుకొచ్చిపేగు బంధాలనే తెంపుకుంటున్నాయిమా శరీరాలు పంచి ఇచ్చిన రక్తంకాలకూట విషమయ్యిందియవ్వనానికి రెక్కలు మొలిచిడొక్కల్లో నిర్దాక్షిణ్యంగా తన్ని పోతున్నాయిప్రేమలు కలుషితం అయిమానవత్వం పొగుచూరిందిబిడ్డలారా మీ ప్రేమలు వర్ధిల్లాలిమీ హృదయాంతరాలలో మాత్రం కాదుమా సమాధులపై దిష్టి బొమ్మలై…(వికారాబాద్‌ జిల్లాలో తన ప్రేమను అంగీకరించలేదని తల్లిదండ్రులిద్దరిని విషమిచ్చి చంపిన కూతురి దాష్టీకాన్ని నిరసిస్తూ….)డా.నామోజు బాలాచారి

    The post ప్రేమ ఇప్పుడొక దిష్టి బొమ్మ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment