నవతెలంగాణ – హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవింద్‌పేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. దుర్గయ్య (36)ను భార్య మంజుల గొంతు నులిమి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసిందని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు మంజులతో పాటు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది.
The post ప్రియుడితో కలిసి భర్త గొంతు నులిమి చంపిన భార్య appeared first on Navatelangana.
Leave A Comment