• Login / Register
  • Site Logo

    ప్రాణం తీసిన పబ్జీ..మెదడులో రక్తనాళం చీలిపోయి యువకుడు మృతి

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో 22 ఏళ్ల మహ్మద్ కైఫ్ అనే యువకుడు పబ్జీ ఆన్‌లైన్ గేమ్ ఆడుతూ మెదడులో రక్తస్రావంతో మరణించాడు. శుక్రవారం తన ఆఫీసులో గేమ్ ఆడుతుండగా స్పృహ తప్పి పడిపోయిన కైఫ్‌ను కుటుంబ సభ్యులు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల చికిత్స అనంతరం ఆదివారం మరణించినట్లు వైద్యులు తెలిపారు. అధిక రక్తపోటు కారణంగా మెదడులోని రక్తనాళం చీలిపోయి అంతర్గత రక్తస్రావం జరిగిందని నిర్ధారించారు.

    The post ప్రాణం తీసిన పబ్జీ..మెదడులో రక్తనాళం చీలిపోయి యువకుడు మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment