• Login / Register
  • Site Logo

    పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన డీఎస్పీ

    Rss వార్తలు

    నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ను భువనగిరి డీఎస్పీ బండారి రవీందర్ యాదవ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో రోజువారి కార్యకలాపాలను అడిగి తెలుసుకున్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో  తీసుకోవాల్సిన విషయాలపై సూచనలు చేశారు. పోలీసులు పబ్లిక్ తో ఏ విధంగా వ్యవహరించాలో కీలక సూచనలు చేశారు. ఈ  కార్యక్రమంలో  రూరల్ సీఐ చంద్రబాబు, ఎస్సై అనిల్ కుమార్,  పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

    The post పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన డీఎస్పీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment