నవతెలంగాణ – ముధోల్ 2027లో జరగనున్నపుష్కరాలను దృష్టిలో పెట్టుకుని మండలంలోని ఆష్ట గ్రామంలో పుష్కర ఘాట్లను అధికారులు శుక్రవారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ శ్రీలత, ఆర్ఐ నారాయణరావు పటేల్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ హరిచందన, ఘాట్ల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్న ట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ తదితరులున్నారు.
The post పుష్కర ఘాట్లను పరిశీలించిన అధికారులు.. appeared first on Navatelangana.
Leave A Comment