నవతెలంగాణ – రామారెడ్డి మండలంలోని రంగంపేట ప్రాథమిక పాఠశాలకు శుక్రవారం అవార్డీ టీచర్స్ అసోసియేషన్ కామారెడ్డి వారి సహకారంతో 20 కుర్చీలు వితరణ చేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు ఆంజనేయులు మాట్లాడుతూ… విద్యార్థులకు కుర్చీలు అందజేసినందుకు అసోసియేషన్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఆనందరావు, అసోసియేషన్ అధ్యక్షులు మనోహర్, శ్రీనివాస్, ఉపాధ్యాయురాలు రామ, కవిత, సిఆర్పి మహమ్మద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
The post పాఠశాలకు కుర్చీల వితరణ appeared first on Navatelangana.
Leave A Comment