• Login / Register
  • Site Logo

    పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలోని పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆ శాఖల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పదోన్నతులకు ఆమోదం తెలుపుతూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సుమారు 130 మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరింది. గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శులకు సూపరింటెండెంట్లుగా, అలానే సీనియర్ అసిస్టెంట్లకు కూడా ప్రమోషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతులు లభించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    The post పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment