• Login / Register
  • Site Logo

    నేడు నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్ : నేడు నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. బర్దిపూర్‌లో రూ.687 కోట్ల వ్యయంతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 1,200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. సీఎం పర్యటనతో జిల్లాలో రాజకీయంగా, అభివృద్ధి పరంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

    The post నేడు నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment