• Login / Register
  • Site Logo

    నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగాలి

    Rss వార్తలు

    -అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్నవతెలంగాణ – రాయికల్పట్టణంలోని మున్సిపాలిటీలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్ శుక్రవారం పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ,స్క్రూటినీ,అప్పీల్స్ పరిష్కారం,గుర్తుల కేటాయింపు తదితర ప్రక్రియలు సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.దాఖలైన నామినేషన్ల వివరాలను రోజువారీగా టీ-పోల్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటిస్తూ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె.నాగరాజు,రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

    The post నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment