నవతెలంగాణ – హైదరాబాద్ : నాంపల్లి ఘటనలో మంటల్లో చిక్కుకున్న ఐదు మృతదేహాలను అధికారులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో అఖిల్ (7), ప్రణీత్ (11), హాబీబ్ (35), ఇంతియాజ్ (32), బేబీ (43) మృతి చెందినట్లు గుర్తించారు. మంటల్లో చిక్కుకుపోయిన మరో వ్యక్తి ఆచూకి కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
The post నాంపల్లి ఘటన.. ఐదు మృతదేహాల గుర్తింపు appeared first on Navatelangana.
Leave A Comment